చంద్రబాబుకు విజయసాయి సూటి ప్రశ్న.?

October 23, 2020 at 1:42 pm

వైసీపీ కీలక నేత పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు పై స్పందిస్తూ తనదైనశైలిలో ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి.

ఇటీవలకాలంలో టీడీపీ చేస్తున్న విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది… చంద్రబాబు తన కోసం తనవారి కోసం ఆరాట పడుతూ ఉంటే… జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎన్నో కులాల కోసం మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతర పోరాటం చేస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ చంద్రబాబు మధ్య ఇదే తేడా అంటూ వ్యాఖ్యానించారు. తమ పథకాలు పేరుమార్చి ప్రస్తుతం జగన్ ప్రవేశపెడుతుంది అంటూ టీడీపీ విమర్శలు చేస్తుందని… చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి విషయంలో చూపించిన గ్రాఫిక్స్ తప్ప… ప్రవేశపెట్టిన 4 వెల్ఫేర్ స్కీముల గురించి చెప్పండి చంద్రబాబు గారు అంటూ సూటిగా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబుకు విజయసాయి సూటి ప్రశ్న.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts