చంద్రబాబు పై కోపం ప్రజలపై తీర్చుకుంటున్న సీఎం జగన్.?

October 23, 2020 at 1:47 pm

ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. పలు అంశాలను లేవనెత్తి జగన్ సర్కారు తీరును ఎండగట్టారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. టిడ్కొ గృహాలను లబ్ధిదారులకు వెంటనే జగన్ సర్కార్ అందజేయాలి అంటూ డిమాండ్ చేసిన సిపిఐ రామకృష్ణ… ప్రభుత్వం స్పందించకుంటే నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రిలే నిరాహార దీక్షలు చేపడుతుంది అంటూ హెచ్చరించారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఈ నెల 16వ తేదీన లబ్ధిదారులకు నేరుగా ఇళ్లల్లోకి తీసుకెళ్తాము అంటూ హెచ్చరించారు.

ప్రజల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని చంద్రబాబు పై ఉన్న కోపాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలపై చూపుతూ వుండడం సరైనది కాదు అంటూ సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు. అమరావతి కి వ్యతిరేకంగా ప్రభుత్వమే ఆందోళనలు చేస్తోంది అంటూ రామకృష్ణ వ్యాఖ్యానించారు. అమరావతి పై రెఫరెండం గా ఎన్నికలకు వెళితే జగన్ కు ఒక్క సీటు వచ్చినా మళ్ళీ అమరావతి అంశంలో మాట్లాడము అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు పై కోపం ప్రజలపై తీర్చుకుంటున్న సీఎం జగన్.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts