చాన్సులు లేక నమిత ఏం చేస్తుందో తెలుసా తెలుసా..?

October 22, 2020 at 4:46 pm

తెలుగు చిత్ర పరిశ్రమలో జెమిని అనే సినిమా ద్వారా విక్టరీ వెంకటేష్ సరసన నటించిన నమిత తర్వాత పూర్తిగా బల్కి బ్యూటీగా మారిపోయి నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కేవలం తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాదు అటు తమిళ మలయాళ ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఎన్నో సినిమాల్లో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది నమిత. 2017లో నమిత ప్రేమ వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత నమితకు సినిమా అవకాశాలు కాస్త తగ్గాయని చెప్పాలి .

ఆ తర్వాత నమిత బీజేపీలో చేరారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో నమిత కొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యారు. పొలిటీషియన్ గా కూడా అంతగా అచ్చి రాకపోవడంతో ప్రస్తుతం సినిమా నిర్మాతగా మారేందుకు నమిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ సినిమా నిర్మిస్తున్నట్లు నమిత ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో నమిత నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

చాన్సులు లేక నమిత ఏం చేస్తుందో తెలుసా తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts