చెన్నై జట్టులో అతడు రాణించక పోతే అదే జరిగేది : పోలార్డ్

October 24, 2020 at 4:05 pm

నిన్న ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్లుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్ లో రెండవ సారి తలపడ్డాయి ఈ రెండు జట్లు. ఇక ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగి కొన్ని పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై పై విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేయడంతో ముంబై ఘన విజయాన్ని సాధించింది.

ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే కేవలం 12 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే ముంబై విజయం పై మాట్లాడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కిరణ్ పోలార్డ్.. చెన్నై తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఆటగాళ్లు కేవలం 100 పరుగులకే కట్టడి చేయాలి అనుకున్నామని చెప్పుకొచ్చారు కానీ చివర్లో శ్యామ్ కరణ్ రాణించడంతో అది సాధ్యం కాలేదు అంటూ తెలిపారు. కానీ పవర్ ప్లే ముగిసేసరికి ఏకంగా కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టడం ఎంతో ఆనందం కలిగించింది అంటూ కిరణ్ పోలార్డ్ చెప్పుku వచ్చారు. కాగా నిన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఆడకపోవడంతో ముంబై జట్టుకు పోలార్డ్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే.

చెన్నై జట్టులో అతడు రాణించక పోతే అదే జరిగేది : పోలార్డ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts