చెన్నై కెప్టెన్సీ మార్పుపై యాజమాన్యం క్లారిటీ..?

October 27, 2020 at 2:58 pm

ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటినుంచి పేలవ ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఈ ఏడాది మాత్రం వరుస ఓటములతో ఏకంగా 12 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది… లీగ్ దశలోనే ఈ ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై నిష్క్రమించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే రాబోయే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని ని తప్పించే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై స్పందించారు సిఎస్కె జట్టు సీఈవో విశ్వనాథన్. ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన ప్రతి సీజన్లో కూడా ప్లే ఆఫ్ కు చేరుకున్న ఒకే ఒక్క జుట్టు చెన్నై అని మూడుసార్లు టైటిల్ను కూడా గెలిచింది అని ఇదంతా ధోని సారథ్యంలోనే జరిగిందని… అలాంటిది ఒక్కసారి పేలవ ప్రదర్శన చేసినంత మాత్రాన జట్టు ప్రక్షాళన జరుగుతుంది అని అనుకోవడం పొరపాటు అంటూ చెప్పుకొచ్చారు. వచ్చే సీజన్లో కూడా చెన్నై జట్టు ధోనీ సారథ్యంలోనే ముందుకు వెళుతుంది అంటూ తెలిపారు స్వామినాథన్.

చెన్నై కెప్టెన్సీ మార్పుపై యాజమాన్యం క్లారిటీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts