చిన్న సినిమాపై బన్నీ ప్రశంసలు..!

October 2, 2020 at 3:46 pm

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిన్న సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కొన్ని ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ ఉంటాయి… మరికొన్ని సినిమాలు ప్రేక్షకులతో పాటు స్టార్ హీరోలను సైతం మెప్పించి ప్రశంసలు అందుకుంటూ వుంటాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ని ఓ చిన్న సినిమా మెప్పించింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ ఇటీవలే ఓ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపించాడు.

కరుణ కుమార్ దర్శకత్వంలో తెగిన పలాస 1978 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను తాను చూశానని.. వ్యక్తిగతంగా తనకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందని… ఈ సినిమాలో అంతర్లీనంగా గొప్ప సందేశం తో దర్శకుడు సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ ప్రశంసించాడు అల్లు అర్జున్. తర్వాత రోజు ఈ సినిమా దర్శకుడు ని పిలిచి అభినందించినట్లు చెప్పుకొచ్చాడు బన్నీ.

చిన్న సినిమాపై బన్నీ ప్రశంసలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts