చిన్న బొమ్మ చిన్నారి ప్రాణం తీసింది..?

October 5, 2020 at 4:20 pm

అంతా ఆనందంగా ఉంది అనుకుంటున్న తరుణంలో కొన్ని కొన్ని సార్లు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పటివరకు కళ్ళముందే ఆడుకున్న పిల్లలు క్షణాల్లో విగతజీవిలుగా మారిపోతుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు చిన్నపాటి నిర్లక్ష్యం అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు ప్రాణం తీసింది. కూతురు కోసం తెచ్చిన చిప్స్ ప్యాకెట్ ఏకంగా చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలోని గిరిజన పల్లి లో చోటుచేసుకుంది.

సంధ్య అనే మహిళ తన కూతురు కోసం ఎంతో ప్రేమగా చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చింది. చిన్నారి చిప్స్ ప్యాకెట్ లో చిప్స్ తింటూ తింటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారి ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎలా చనిపోయిందో అని గమనిస్తే ఆ చిప్స్ ప్యాకెట్ లో చిన్న బొమ్మ వస్తుంది. చిప్స్ తింటూ తింటూ ఆ బొమ్మను కూడా మింగటంతో గొంతులో ఆ బొమ్మ ఇరుక్కుపోయి ఊపిరాడక చిన్నారి ప్రాణాలు వదిలినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లితండ్రులు బోరున విలపించారు.

చిన్న బొమ్మ చిన్నారి ప్రాణం తీసింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts