చైనా వ్యాక్సిన్ కు.. బ్రెజిల్ షాక్..?

October 22, 2020 at 4:57 pm

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రెజిల్లో అయితే రోజుకు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ప్రభుత్వ ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య ఎక్కడ తగ్గడం లేదు. కరోనా వైరస్ పంజా దెబ్బకి ప్రస్తుతం బ్రెజిల్ మొత్తం వణికిపోతుంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఇప్పటికే అభివృద్ధి చేసిన చైనా నుంచి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు బ్రెజిల్ ఒప్పందం కుదుర్చుకుంది కానీ ఇటీవలే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ చైనా కి భారీ షాక్ ఇచ్చింది బ్రెజిల్.

చైనా కు సంబంధించిన సినోవిక్ వ్యాక్సిన్ను బ్రెజిల్ కొనుగోలు చేయదని ఇటీవలే బ్రెజిల్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ కొనవద్దు అంటూ ఇటీవల ఎంతో మంది దేశ పౌరులు అధ్యక్షునికి సోషల్ మీడియా ఇక విన్నవించగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ కొనుగోలు కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బ్రెజిల్ బూటాన్టున్ అనే వ్యాక్సిన్ ను ఉపయోగిస్తుంది అంటూ తెలిపారు.

చైనా వ్యాక్సిన్ కు.. బ్రెజిల్ షాక్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts