తెలంగాణ ఆడపడుచులకు చిరంజీవి శుభాకాంక్షలు?

October 24, 2020 at 2:45 pm

తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఆడపడుచు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో పూజలందుకునే బతుకమ్మ.. చివరి రోజు సద్దుల బతుకమ్మ.

ఈ రోజే స‌ద్దుల బ‌తుక‌మ్మ‌. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఆగ‌ప‌డుచుత‌కు టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

 

తెలంగాణ ఆడపడుచులకు చిరంజీవి శుభాకాంక్షలు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts