పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన చిరంజీవి భార్య.. ఫొటో వైర‌ల్‌!

October 22, 2020 at 1:55 pm

క‌న్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. కేవలం 35 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు ఈయన. అయితే చిరు చనిపోయే సమయానికి అతడి భార్య మేఘన రాజ్ గర్భవతి. ఇటీవలే ఆమెకు సీమంతం కూడా చేశాడు కుటుంబ‌స‌భ్యులు. ఈ వేడుకలలో తన భర్త చిరంజీవి సర్జా ఫోటోను తన పక్కన పెట్టుకొని భర్త మీదున్న ప్రేమను తెలియజేశారు.

అయితే తాజాగా మేఘ‌న రాజ్ పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ ఇప్పటికే చిరు త‌మ్ముడు ధృవ బాగా ఎమోషనల్ అవుతున్న సందర్భంలో.. వారికి ఈ వార్త ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజే చిరంజీవి సర్జా, మేఘనల ఎంగేజ్ మెంట్ డే కూడాన‌ట‌.

దీంతో వారి ఆనందం రెట్టింపు అయ్యింది. ప్ర‌స్తుతం చిరంజీవి కొడుకు దృవ ఎత్తుకున్న ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. జూన్ 7న చిరంజీవి సర్జా కన్నుమూసినప్ప‌టి నుంచి వ‌దిన మేఘనకు ఏ లోటు లేకుండా తల్లిలా చూసుకుంటున్నాడు ధృవ.

Meghana Raj gives birth to baby boy, Chiranjeevi Sarja is back: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన చిరంజీవి భార్య.. ఫొటో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts