ప్లాస్మాదానం చేసిన నాగబాబు.. సర్ ప్రైజ్ చేసిన చిరు!

October 29, 2020 at 3:09 pm

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా స్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో సినీ రంగప్రవేశం చేసి తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ‌బాబు పుట్టిన రోజు నేడు. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబుకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే పుట్టిన రోజు సంద‌ర్భంగా నాగ‌బాబు.. చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో రెండో సారి ప్లాస్మాదానం చేశారు.

Image

అయితే నాగ‌బాబు ప్లాస్మాదానం చేస్తుండ‌గా.. ఎలాంటి సమాచారం లేకుండా చిరింజీవి స‌డ‌న్‌గా వ‌చ్చి స‌ర్ ప్రైజ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ట్రస్టు కార్యాలయంలో చిరు స‌మ‌క్షంలో నాగ‌బాబు జన్మదిన వేడుకలు జరుపుకుని మురిసిపోయారు.

ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు మాట్లాడుతూ.. తన అన్నయ్య వస్తున్నట్టు తనతో పాటు ఎవరికీ తెలియదని, తాను వస్తున్నట్టు ముందుగా సమాచారం ఇవ్వకుండానే వచ్చేసి తనను ఎంతో సంతోషానికి గురిచేశాడని పేర్కొన్నాడు. కాగా, ప్ర‌స్తుతం ఇందుకు సంబంధిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ప్లాస్మాదానం చేసిన నాగబాబు.. సర్ ప్రైజ్ చేసిన చిరు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts