ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగుతున్న చిరు?

October 29, 2020 at 7:56 am

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సామాజిక కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీ చిత్రీకరణ 30 శాతం పూర్తి అయ్యింది. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్‌తో ఈ సినిమా షూటింగ్‌కు సైతం బ్రేకులు పడ్డాయి.

లాక్ డౌన్ సడలింపులు జరిగాక జూన్‌లోనే చాలా సినిమాలు షూట్ రీస్టార్ట్ అయ్యాయి. కానీ ఆచార్య మొదలుకాలేదు. క‌రోనా స‌మ‌యంలో షూటింగ్ ప్రారంభించేందుకు చిరు ఇష్ట‌ప‌డ‌లేదు. అందుకే ఇన్ని రోజులు షూట్ మొదలుకాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతుండటంతో చిరు కూడా చిత్రీకరణ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. నవంబర్ 3వ వారం నుండి షూట్ మొదలవుతుందట. అయితే ఈలోపే షూటింగ్ రీస్టార్ట్ చేసేసి ఇతర నటీనటుల మీద చిత్రీకరణ జరపనున్నారు. ఇక చిరు జాయిన్ అయ్యాక ఆయన మీద సన్నివేశాలను తెరకెక్కిస్తారు. మొత్తానికి చిరు రంగంలోకి దిగ‌నున్నాడు. కాగా, ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగుతున్న చిరు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts