రాజశేఖర్ కుమార్తెకు ‘చిరు’ మెసేజ్!

October 22, 2020 at 2:53 pm

సినీ నటుడు రాజశేఖర్ కరోనాకు గురైన విషయం తెలిసిందే. అయితే కరోనా వల్ల రాజశేఖర్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన్ని హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో జాయిన్ చేశారు. అయితే రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన కుమార్తె శివాత్మిక ఓ ట్వీట్ చేశారు. కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ దయచేసి ప్రార్థనలు చేయండని శివాత్మిక ట్వీట్ చేశారు.

ఇక ఆ ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. `డియర్ శివాత్మిక.. మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మా అందరి ప్రార్థనలు, మద్దతు ఆయనకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి`అని చిరంజీవి పేర్కొన్నారు.

కాగా, రాజశేఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని హాస్పిటల్ యాజమాన్యం తాజాగా వెల్లడించింది.

 

 

రాజశేఖర్ కుమార్తెకు ‘చిరు’ మెసేజ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts