దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ..!

October 21, 2020 at 6:07 pm

విజయవాడలోని దుర్గమ్మ గుడికి సీఎం జగన్ చేరుకున్నారు. సీఎం జగన్ కు ఆలయ చైర్మన్, ఈవో స్వాగతం పలికారు.నేడు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనం ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి జన్మా నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇది ఇలా ఉండగా జగన్ పర్యటనకు ముందే ఇంద్రకీలాద్రిపై నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు కొండచరియలు విరిగిపడ్డాయి.ఇలా కొండచరియలు విరిగి పడిన సంఘటన పై మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ను పూర్తి వివరాలు అడిగి సీఎం జగన్ తెలుసుకున్నారు. ఇక ఈ సంఘటనలో ముగ్గురు గాయాలపాలు అయ్యారు వారిలో దేవస్థానం ఏఈ చరణ్, అటెండర్ సుధాకర్, కానిస్టేబుల్‌ కిరణ్‌కు గాయాలు అయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు హెచ్చరించిన కూడా సంఘటన చోటు చేసుకుంది.

దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts