ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడబోతున్న సీఎం కేసీఆర్ రెండో కుమార్తె!

October 19, 2020 at 12:50 pm

సవతి తల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలకు గురై.. దాదాపు చావు అంచులదాక వెళ్లిని ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రత్యూషను తన రెండో కుమార్తెగా చూసుకుంటానని.. ఆమె చదువు, పెళ్లి బాధ్యత తనదేనని కూడా కేసీఆర్ తెలిపారు. అయితే కేసీఆర్ రెండో కుమార్తె త్వ‌ర‌లోనే ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లాడబోతోంది.

A 'suitable' kind of love: Andhra HC, officials probe the man KCR's adopted  daughter wants to marry | India News,The Indian Express

సీఎం కేసీఆర్‌ ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించగా, ఆ అధికారి పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తోంది. ప్రస్తుతం నర్సింగ్ ను పూర్తిచేసిన ప్రత్యూష ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తూ తన కాళ్లపై తాను నిల‌బ‌డింది.అయితే ప్రత్యూష తాజాగా నిశ్చితార్థం చేసుకుంది.

CM KCR Adopted Daughter Prathyusha Engagement With Charan Reddy - Sakshi

హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. హైదరాబాద్ రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో నిరాడంబరంగా జరిగిన ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు. మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని పంచుకోబోతోంది.

 

ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడబోతున్న సీఎం కేసీఆర్ రెండో కుమార్తె!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts