
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలతో నగరమంత అతలాకుతలం అయిపోయింది. నగరంలో వరద ప్రభావం కి గురైన వారందరికీ సీఎం కేసీఆర్ ఒక శుభవార్త తెలియజేశారు. వరద ప్రభావంకి గురి అయిన ప్రతి ఇంటికి ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక సహాయాన్ని మంగళవారం నుంచే బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు.. కాస్త పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న బాధితులకు 50 వేల రూపాయలు చేస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు అన్నిటినీ మరమ్మతులు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పేదలకు సహాయం కోసం పురపాలకశాఖ నుంచి రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.