కర్ణాటకలో అప్పటి నుంచి తెరుచుకోనున్న కాలేజీలు..!

October 23, 2020 at 4:40 pm

కరోనా వైరస్ దేశంలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆర్ధికంగా అన్ని వర్గాల వారు ఎంతో నష్టపోయారు.. విద్యార్థులు సైతం కరోనా వైరస్ వల్ల ఇంటికే పరిమితం అయ్యారు.ఈ సంవత్సరం పాఠశాలలు అన్ని మూతబడ్డాయి. అయితే మళ్ళీ ఇన్ని నెలల విరామం తర్వాత కాలేజీలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతున్నాయి. కర్నాటక రాష్ట్రంలో నవంబర్ 17నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి.అయితే విద్యార్థులు అప్పటివరకూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల జరిగిన చర్చలో కర్నాటకా సీఎం యెడ్యురప్ప కూడా హాజరయ్యారు.

 

ఈ సమావేశానికి ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, రావాణా, విద్యా శాఖలకు సంబందించిన అధికారులు అందరు హాజరయ్యారు. అందరి అంగీకారంతోనే మళ్ళీ కాలేజీలు తిరిగి ప్రారంభం చేస్తున్నామని చెప్పారు అయతే డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లోమా కాలేజీలను 17న తిరిగి ప్రారంభించమని కర్నాటకా డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వాత్ నారాయన్ తెలిపారు. అయితే విద్యార్థులకు రెండు రకాల సదుపాయాలను కల్పించారు. విద్యార్థులు కాలేజీకి రావచ్చు లేదా ఆన్‌లైన్ క్లాసులకు హాజరైన కావచ్చని చెప్పారు.కావాలంటే రెండూ కూడా చేయవచ్చని తెలిపారు. కాలేజీలకు వచ్చే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తప్పక పాటించాలని కోరారు. ముఖ్యంగా మాస్క్, సామజిక దూరం తప్పనిసరి అని తెలిపారు. అయితే తరగతులు ఎలా మొదలు పెట్టాలి, విద్యార్థులను ఎన్ని బ్యాచ్‌లుగా విడదీయాలనే వాటిమీద ఇంకా క్లారిటీ లేదని చెప్పారు.. !!

కర్ణాటకలో అప్పటి నుంచి తెరుచుకోనున్న కాలేజీలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts