ఎన్టీఆర్ టీజ‌ర్‌పై వివాదం.. ఆ విష‌యంలో మండిప‌డుతున్న‌ నెటిజ‌న్లు‌?

October 24, 2020 at 7:41 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ టీజ‌ర్ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని నంద‌మూరి ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూశారు.

ఆ త‌రుణం రానే వ‌చ్చింది. అక్టోబర్ 22 ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను జ‌క్క‌న్న విడుద‌ల చేశారు. `వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి’.. అంటూ చెర్రీ వాయిస్ తో ఉన్న ఎన్టీఆర్ భీమ్ టీజర్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ టీజ‌ర్ యుట్యూబ్‌లో ట్రెడింగ్‌లో కొన‌సాగుతోంది. అయితే తాజాగా ఈ టీజ‌ర్‌పై ఓ వివాదం చెల‌రేగింది. వాస్త‌వానికి ఎన్టీఆర్ చేస్తున్న భీమ్ పాత్ర తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర ఆధారంగా డిజైన్ చేయబడిన పాత్ర.

అయితే జ‌క్క‌న్న విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో నైజాం మీద అవిశ్రాంత పోరు సలిపిన కొమరం భీమ్ ముస్లిం గెటప్‌లో క‌నిపించారు. ఇప్పుడు ఇదే విమర్శలకు కారణమైంది. భీమ్ నిజాం నిరంకుశ పాలనపై పోరాడితే ఆయన్ను ముస్లిం వేషధారణలో చూపడం ఏమిటని, కల్పిత గాథ అంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారా ఏమిటి, భీమ్ ప్రతిష్టకు భంగం కలిగేలా సినిమా ఉంటే వ్యతిరేకత త‌ప్ప‌ద‌ని అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ అన్నది ఓ కీలక ట్విస్ట్ అని వినిపిస్తోంది.

ఎన్టీఆర్ టీజ‌ర్‌పై వివాదం.. ఆ విష‌యంలో మండిప‌డుతున్న‌ నెటిజ‌న్లు‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts