ఆ బ్ల‌డ్ గ్రూప్ వాళ్ల‌కు క‌రోనా రాద‌ట‌..?

October 17, 2020 at 7:35 am

క‌రోనా మ‌హ‌మ్మారితో యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోతున్న‌ది. ఆ వైర‌స్‌కు సంబంధించి రోజుకో విష‌యం వెలుగులోకి వ‌స్తున్న‌ది. ప‌రిశోద‌న‌లు ముందుకు సాగినాకొద్దీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచుతున్నాయి. మ‌రోవైపు వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే మందు కోసం యావ‌త్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోద‌న‌లు జ‌రుపుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లు కంపెనీ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. ప‌లు ద‌ఫాలుగా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను కూడా నిర్వ‌హించాయి. అందులో భార‌త్ బ‌యోటెక్ కంపెనీ కూడా ఉండ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా తాజాగా పలు దేశాల‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు చేసిన అధ్య‌య‌నాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. విష‌యం ఏమిటంటే మిగ‌తా బ్ల‌డ్ గ్రూపుల‌తో పోల్చితే ఓ పాజిటివ్ బ్ల‌డ్ గ్రూపు ఉన్న‌వారికి క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా సోకిన 7422 మంది బ్ల‌డ్ శాంపిళ్ల‌ను సేక‌రించి డెన్మార్క్‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోద‌న సాగించారు. అందులో ఏ, ఓ బ్ల‌డ్ గ్రూపుల మ‌ధ్య ఏకంగా 60శాతం వ్య‌త్యాసం ఉన్న‌ట్లు గుర్తించారు. ఇక అదేవిధంగా కెన‌డాకు చెందిన శాస్త్ర‌వేత్త‌లు కూడా వెంటిలెట‌ర్ల‌పై చికిత్స పొందుతున్న క‌రోనా రోగుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. వారిలో 85శాతం మంది ఏ, ఏబీ బ్ల‌డ్ గ్రూపు వారుంటే, ఓ, బీ బ్ల‌డ్ గ్రూపువారు 61శాతంగా ఉన్నార‌ని గుర్తించారు. అదేవిధంగా క‌రోనా మిగ‌తా గ్రూపుల‌తో పోల్చితే ఓ బ్ల‌డ్ గ్రూప్ వాళ్ల‌కు త‌క్కువ‌గా సోకే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అదేవిధంగా వారు వైర‌స్ బారిన ప‌డినా చాలా కొలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెల‌ప‌డం విశేషం. ‌

ఆ బ్ల‌డ్ గ్రూప్ వాళ్ల‌కు క‌రోనా రాద‌ట‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts