ప్ర‌ముఖ సినీగాయ‌కుడికి క‌రోనా పాజిటివ్‌

October 17, 2020 at 10:19 am

సుదీర్ఘ విరామం త‌రువాత సినీ రంగానికి ఇటీవ‌ల లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపులు ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. దీంతో ఇప్పుడిప్పుడే చిత్ర ప‌రిశ్ర‌మ తిరిగి త‌న కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్టింది. వాయిదాప‌డిన షూటింగ్‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అయితే మ‌రోవైపు క‌రోనా మాత్రం వీడ‌డం లేదు. సినీ లోకాన్ని వెన్నాడుతున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర‌తార‌లు, సినీ ప్ర‌ముఖులు కొవిడ్ బారిన ప‌డ్డారు. అందులో నుంచి కొంద‌రు కోలుకోగా, గానగంధ‌ర్వుడు బాలు మాత్రం క‌న్నుమూశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ గాయకుడు కుమార్‌ సాను (63) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా తన ఫేస్‌బుక్‌ ద్వారా తాజాగా వెల్లడించారు.

‘దురదృష్టవశాత్తు నాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దయచేసి నీను త్వరగా కోలుకోవాలనీ దేవుడిని ప్రార్థించండి. థ్యాంక్యూ ‌’ అంటూ సాను అందులో పోస్ట్‌ చేశారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర అందోళన చెందుతున్నారు. సాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతూ సందేశాలు పంపిస్తున్నారు. కుమార్‌ సాను 90వ దశకంలో బాలీవుడ్‌లో అద్భుత పాటలతో అలరించారు. బీబీసీ టాప్‌ 40 బాలీవుడ్‌ సౌండ్‌ట్రాక్స్‌లో కుమార్‌ పాటలు దాదాపు 25 ఉన్నాయంటే మాటలు కాదు. అతను 30 భాషల్లో 21 వేల పాటలను పాడి రికార్డు సృష్టించారు. అంతేగాక కేవలం ఒకే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు కూడా సాధించారు. కుమార్ సానున 2009లో పద్మ శ్రీ అవార్డును పొందారు. తెలుగులో కూడా కుమార్ సాను పాపులరే.. ఆయన పాడిన ‘దేవుడు వరమందిస్తే.. నే నిన్నే కోరుకుంటాలే’ పాట ఇప్పటికే చాలా మందికి ఫేవరేట్ సాంగ్ కావ‌డం విశేషం.

ప్ర‌ముఖ సినీగాయ‌కుడికి క‌రోనా పాజిటివ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts