కరోనా ఎఫెక్ట్: కస్టమర్ల రక్షణ కోసం వినూత్న ప్రయత్నం..!

October 18, 2020 at 6:23 pm

గడిచిన 8 నెలలగా కరోనా వైరస్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో అనేక హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆన్ లాక్ డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా భాగంగా హోటల్స్, రెస్టారెంట్స్ తిరిగి తెరుచుకున్నాయి. ఇదిలా ఉండగా… మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా ఉండడంతో రెస్టారెంట్ అధికారులు కస్టమర్ల రక్షణ కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ తరుణంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కొతాలోని ఒక రెస్టారెంట్ మానేజ్మెంట్ వారు కస్టమర్ల కోసం జిప్ మాస్క్ లను ఉచితంగా అందజేస్తున్నారు. దీనితో వారు ఎప్పుడైనా ఏదైనా తినాలి అనుకున్నపుడు, అలాగే తాగాలి అనుకున్నప్పుడు అయినా ఆ మాకు ఉన్న జిప్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ జిప్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ సందర్భంగా ఆ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ..తమ కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా వారికి ఉచితంగా జిప్ మాస్క్ లను అందజేసినట్లు తెలిపాడు. అలాగే మేము ఇచ్చిన మాస్క్ మాత్రమే ధరించాలన్న నిబంధన ఏమీ లేదు అని పేర్కొన్నాడు కస్టమర్లు వారి మార్పులతోనే రెస్టారెంట్ కూడా రావొచ్చని యజమాని తెలిపాడు. ఏది ఏమైనా కానీ కస్టమర్లు రక్షణ కోసం యజమాని చేసిన ప్రయత్నం చాలా బాగుంది.

కరోనా ఎఫెక్ట్: కస్టమర్ల రక్షణ కోసం వినూత్న ప్రయత్నం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts