జీవిత కు కరోనా నెగిటివ్, రాజశేఖర్ పాజిటివ్.. నిలగడగానే ఆరోగ్యం..!

October 24, 2020 at 4:29 pm

తాజాగా హీరో రాజశేఖర్ సంబంధించిన హెల్త్ బులిటెన్ ను హాస్పిటల్ విడుదల చేసింది. ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా మహమ్మారికి గురైన విషయం అందరికీ తెలిసిందే. కరోనా పాజిటివ్ అని తేలడంతో సిటీ న్యూరో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం రాజశేఖర్ మీద ఎక్కువగా ఉండడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. రెండు రోజుల క్రితం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటంతో ఆయన కుమార్తె తన తండ్రి కోసం ప్రార్థన చేయండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులను కోరింది.

ముఖ్యంగా రాజశేఖర్ కు ఆయన ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఏర్పడడంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అలాగే, ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు జీవితా రాజశేఖర్ కు కరోనా నెగటివ్ రావడంతో ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

జీవిత కు కరోనా నెగిటివ్, రాజశేఖర్ పాజిటివ్.. నిలగడగానే ఆరోగ్యం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts