బుల్లి తెర బ్యూటీ రష్మికి కరోనా పాజిటివ్..!

October 23, 2020 at 5:57 pm

రష్మీ…. ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు. తన నటనతో, వచ్చి రాని భాషతో హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యక ఇమేజ్ ను సంపాదించుకుంది..యాంకర్ గా రాకముందు అప్పట్లో సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. కానీ ఎప్పుడయితే యాంకర్ గా జబర్దస్త్ లో దర్శనమిచ్చిందో అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లో రష్మికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు తాజాగా రష్మి గురించి ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే రష్మి నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యాక్రమాల్లో రష్మీ పాల్గొంటున్న సమయంలోనే కరోనా వైరస్ బారిన పడిందట. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ముందుగానే ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది.కానీ టెస్ట్ రిపోర్టులో అనుకోని విధంగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించింది.అందుకనే అటు సినిమా ప్రమోషన్ ఆ కార్యక్రమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. అంతేకాకుండా ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను కూడా రష్మి రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. రష్మీ సంగతి అటు ఉంచితే, ఇటు సుడిగాలి సుధీర్ కు కూడా కరోనా సోకినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది.

బుల్లి తెర బ్యూటీ రష్మికి కరోనా పాజిటివ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts