కేంద్రమంత్రి అథవాలేకు కరోనా పాజిటివ్..!

October 27, 2020 at 3:49 pm

కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు తాను ఆసుపత్రిలో చేరానని, అలాగే తనతో సన్నిహితంగా ఉన్న అందరు కూడా తక్షణమే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇదివరకు దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో కొద్ది మంది బౌద్ధ సన్యాసులతో కలిసి ‘గో కరోనా గో’ అంటూ గతంలో వార్తల్లో నిలిచిన అథవాలే ఇప్పుడు కరోనా బారిన పడటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

పాయల్ ఘోష్ తమ పార్టీలో చేరిన సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు అథవాలే. పాయల్ ఘోష్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆమెను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు . ఈ సమావేశంలో అథవాలే, పాయల్ ఘోష్ ఫేస్ మాస్క్ ధరించినప్పటికీ దాన్ని ముక్కు కింద నుంచి తొలగించి మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు. తాజాగా అథవాలే కరోనా బారిన పడటంతో సమావేశానికి హాజరైన వారిలో ఆందోళన మొదలైంది.

కేంద్రమంత్రి అథవాలేకు కరోనా పాజిటివ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts