కరోనా వైరస్ తో బీహార్ మంత్రి మృతి..?

October 16, 2020 at 3:22 pm

కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. సామాన్యులు సెలబ్రిటీల అనే తేడా లేకుండా అందరి పై పంజా విసరడమే కాదు ఎంతో మంది ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ధైర్యం నింపే ప్రజాప్రతినిధులు సైతం వరుసగా కరోనా వైరస్ ప్రాణాలు తీస్తు ఉండడం ప్రజలందరిలో మరింత ఆందోళన పెంచుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులపై పంజా విసిరిన మహమ్మారి కరోనా వైరస్… ఎంతోమంది ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. ఇటీవలే మరో ప్రజా ప్రతినిధి కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.

బీహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ దియ కామత్ ఇటీవలే కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స అందించినప్పటికీ క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ… చివరికి తుది శ్వాస విడిచారు మంత్రి కపిల్ దియా కామత్. ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రి కరోనా వైరస్ ద్వారా మరణించడం పై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు.

కరోనా వైరస్ తో బీహార్ మంత్రి మృతి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts