ఏపీలో అదుపులోకి వస్తున్న కరోనా వైరస్.. నేడు కొత్తగా 2918 కేసులు..!

October 19, 2020 at 7:41 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి బాగా కంట్రోల్ అవుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేసింది. ఇక బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61 ,330 సాంపిల్స్ ను పరీక్షించగా అందులో 2918 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నేటి వరకు 7,83,155 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 4303 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దింతో రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు 7,41,637 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 35,065 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 468 కొత్త పాజిటివ్ కేసులు నమోదవగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 24 మంది మృతి చెందగా.. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6453 మంది కరోనా బారినపడి మృతి చెందారు.

ఏపీలో అదుపులోకి వస్తున్న కరోనా వైరస్.. నేడు కొత్తగా 2918 కేసులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts