దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలు కూడా త‌క్కువే!

October 19, 2020 at 10:23 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇక‌ భార‌త్‌లో నిన్ని క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా త‌గ్గాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 55,722 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 75,50,273 కి చేరింది. అలాగే నిన్న 579 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,14,610 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 66,63,608 మంది కోలుకోగా.. 7,72,055 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక క‌రోనా కేసుల‌తో పాటు రిక‌వ‌రీ రేటు కూడా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, భారత్‌లో నిన్న ఒక్క‌రోజే 8,59,786 క‌రోనా టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 9,50,83,976 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.

దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలు కూడా త‌క్కువే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts