భార‌త్‌లో భారీగా త‌గ్గుతున్న క‌రోనా.. తాజా లెక్క ఇదే!

October 20, 2020 at 10:35 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇక‌ భార‌త్‌లో నిన్న‌ క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా త‌గ్గాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 46,791 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 75,97,064 కి చేరింది. అలాగే నిన్న 587 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,15,197 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67,33,329 మంది కోలుకోగా.. 7,48,538 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక క‌రోనా కేసుల కంటే రిక‌వ‌రీ రేటు భారీగా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, భారత్‌లో నిన్న ఒక్క‌రోజే 10,32,795 క‌రోనా టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 9,61,16,771 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.

భార‌త్‌లో భారీగా త‌గ్గుతున్న క‌రోనా.. తాజా లెక్క ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts