ఇండియాలో 78 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు!

October 24, 2020 at 10:27 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇక‌ భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 53,370 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 78,14,682 కి చేరింది. అలాగే నిన్న 650 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,17,956 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 70,16,046 మంది కోలుకోగా.. 6,80,680 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక క‌రోనా కేసుల కంటే రిక‌వ‌రీ రేటు భారీగా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 10 కోట్ల‌కు పైగా క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.

ఇండియాలో 78 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts