దేశంలో కొత్త‌గా 50,129 క‌రోనా కేసులు.. 90 శాతానికి చేరిన రికవరీ రేటు!

October 25, 2020 at 11:18 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

అయితే ప్ర‌స్తుతం‌ భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 50,129 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 78,64,811 కి చేరింది. అలాగే నిన్న 578 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,18,534 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 70,78,123 మంది కోలుకోగా.. 6,68,154 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ప్ర‌స్తుతం దేశంలో రికవరీ రేటు 90 శాతాన్ని చేరింది. ఇక క‌రోనా కేసుల కంటే రిక‌వ‌రీ రేటు భారీగా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, భారత్‌లో నిన్న ఒక్క‌రోజే 11,40,905 టెస్టులు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం టెస్టుల సంఖ్య 10,25,23,469కి చేరింది.

దేశంలో కొత్త‌గా 50,129 క‌రోనా కేసులు.. 90 శాతానికి చేరిన రికవరీ రేటు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts