దేశంలో త‌గ్గుతున్న క‌రోనా జోరు.. కొత్త కేసులెన్నంటే?

October 26, 2020 at 10:16 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

అయితే ప్ర‌స్తుతం‌ భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 45,148 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 79,09,959కి చేరింది. అలాగే నిన్న 480 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,19,014కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 71.37,228కి మంది కోలుకోగా.. 6,53,717 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ప్ర‌స్తుతం దేశంలో రికవరీ రేటు 90.23 శాతానికి చేరింది. ఇక క‌రోనా కేసుల కంటే రిక‌వ‌రీ రేటు భారీగా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, భారత్‌లో నిన్న ఒక్క‌రోజే 9,39,309 టెస్టులు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం టెస్టుల సంఖ్య 10,34,62,778కి చేరింది.

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా జోరు.. కొత్త కేసులెన్నంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts