దేశంలో 80 ల‌క్ష‌లు దాటేసిన క‌రోనా కేసులు.. ఊర‌ట‌నిచ్చే అంశం ఏంటంటే?

October 29, 2020 at 10:07 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

అయితే ప్ర‌స్తుతం‌ భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు 80 ల‌క్ష‌లు దాటాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 49,881 మందికి కొత్తగా కరోనా సోకింది. దీని ప్ర‌కారం.. దేశంలో క‌రోనా న‌మ్మ‌దిస్తోంద‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 80,40,203 కి చేరింది. అలాగే నిన్న 517 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,20,527 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 73,15,989 మంది కోలుకోగా.. 6,03,687 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక క‌రోనా కేసుల కంటే రిక‌వ‌రీ రేటు భారీగా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, భారత్‌లో నిన్న ఒక్క‌రోజే 10,75,760 టెస్టులు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం టెస్టుల సంఖ్య 10,65,63,440 కి చేరింది.

దేశంలో 80 ల‌క్ష‌లు దాటేసిన క‌రోనా కేసులు.. ఊర‌ట‌నిచ్చే అంశం ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts