తెలంగాణ‌లో కొత్త‌గా 1,486 క‌రోనా కేసులు.. పెరుగుతున్న రిక‌వ‌రీ రేటు!

October 20, 2020 at 9:42 am

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు అంతం అవుతుందో అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో కేసులు త‌గ్గుముఖం ప‌డుతుంటే.. రిక‌వ‌రీ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2,24,545 కు చేరింది. ఇక నిన్న 7 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,282 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 1,891 నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,02,577 కు చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 20,686 ఉన్నాయి. వారిలో 17,208 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 38 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

తెలంగాణ‌లో కొత్త‌గా 1,486 క‌రోనా కేసులు.. పెరుగుతున్న రిక‌వ‌రీ రేటు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts