తెలంగాణ‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. మ‌రింత పెరిగిన రిక‌వ‌రీ!

October 25, 2020 at 9:39 am

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు అంతం అవుతుందో అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌రింత భారీగా త‌గ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 978 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2,31,252 కి చేరింది. ఇక నిన్న 4 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,307 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 1,446 నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,10,480 కి చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 19,465 ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 27,055 క‌రోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పుడు వ‌ర‌కు మొత్తం టెస్ట్‌ల సంఖ్య 40,79,688 కు చేరింది.

తెలంగాణ‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. మ‌రింత పెరిగిన రిక‌వ‌రీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts