తెలంగాణ‌లో 1,324కి చేరిన క‌రోనా మ‌ర‌ణాలు‌.. పాజిటివ్ కేసులెన్నంటే?

October 29, 2020 at 9:32 am

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు అంతం అవుతుందో అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2,35,656కి చేరింది. ఇక నిన్న 5 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,324 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 1,436 నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,16,353కి చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 17,979 ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 41,962 క‌రోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పుడు వ‌ర‌కు మొత్తం టెస్ట్‌ల సంఖ్య 41,96,958కి చేరింది.

తెలంగాణ‌లో 1,324కి చేరిన క‌రోనా మ‌ర‌ణాలు‌.. పాజిటివ్ కేసులెన్నంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts