ఆ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్..!?

October 23, 2020 at 5:08 pm

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు రంగం సిద్దమైనది. మధ్యప్రదేశ్లోని 28 స్థానాలకు గాను మరి కొద్దిరోజుల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి నాయకులు పలు రకాల హామీలు ఇస్తూ ఉంటారు.. ఎందుకంటే ప్రజల్ని ఆకర్షించడానికి.ఎన్నికల్లో నాకు ఓట్లు వేస్తే అది చేస్తాను.. ఇది చేస్తాను అని ప్రచారం చేసే కార్యకర్తల్ని చూసే ఉంటాము. కానీ ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఒక విన్నూత ప్రయత్నం చేసారు. అదేంటంటే ఇప్పటికే దేశంలోని ప్రజలు అందరు కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా… అయితే ఇప్పుడు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను పేదలకు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. గురువారం గ్వాలియర్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్‌లో ఇప్పటికే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. కానీ పేదవాళ్లకు వ్యాక్సిన్‌ కొనే స్థోమత ఉండకపోవచ్చు.అందుకనే రాష్ట్రంలోని పేదలందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా పంపిణీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రా ప్రజలందరినీ కరోనా బారి నుంచి రక్షించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఆ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts