ఖ‌మ్మం అత్యాచార ఘ‌ట‌న‌లో కీల‌క ట్విస్టు.. అస‌లు సూత్ర‌ధారి వేరే

October 19, 2020 at 2:47 pm

తనపై అత్యాచారం చేయబోయిన యజమాని కొడుకును ప్రతిఘటించి.. అగ్నికి అహుతైన చిన్నారి ఘ‌ట‌న‌లో కీల‌క ట్విస్టు చేసుకుంది. దీని అంత‌టికీ కార‌ణం వేరొక‌రుగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు ఆ విచార‌ణ‌లో వెలుగు చూసిన విష‌యాలు ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అంద‌రి మ‌తుల‌ను భ్ర‌మింప‌జేస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారిపై ఆమె ప‌నిచేస్తున్న ఇంటి య‌జ‌మాని అఘాయిత్యానికి తెగ‌బ‌డ్డాడు. ఒంట‌రిగా ఉన్న‌ది చూసి కాటువేయాల‌కున్న‌డు. అయితే ఆ బాలిక ప్ర‌తిఘ‌టించ‌డంతో రెచ్చిపోయిన ఆ దుర్మార్గుడు బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. డెబ్బై శాతం పైగా కాలిన గాయాల‌తో వైద్య‌శాల‌లో చేరిన బాలిక దాదాపు 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుద‌కు ప్రాణాలు విడిచిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మరో కొత్తకోణం వెలుగుచూసింది. అది సంచ‌ల‌నాన్ని రేపుతున్న‌ది. అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

కుటుంబ అవ‌స‌రాల రీత్యా బాలిక‌ తండ్రి తమ గ్రామానికే చెందిన ఓ పెద్దమనిషి వద్ద రూ.లక్షన్నర అప్పు చేశాడు. తీసుకున్నాడని తెలుస్తోంది. నిర్ణీత గ‌డువులో అప్పు తీర్చలేకపోవడంతో ఆ పెద్దమనిషి తన సొమ్మును రాబట్టుకోవడానికి ప‌థ‌కం వేశాడు. తనకు తెలిసిన వాళ్ల ఇంట్లో బాలిక‌ను పనిలో పెడితే ఏడాదికి రూ.లక్షన్నర ఇస్తారని చెప్పాడు. అప్పు తీర్చలేక, ఒత్తిడి తట్టుకోలేక చివ‌ర‌కు ఆ తండ్రి అందుకు సరేనన్నాడు. పనికి కుదిరిన చోట ఆ యజమాని అడ్వాన్సుగా రూ. 50 వేలను ఇవ్వ‌గా.. అందులో వాటిని పెద్దమనిషే తన అప్పు కింద‌ జమ చేసుకున్నాడు. అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా మిగిలిన అప్పును రాబట్టేందుకు మ‌రో ఉపాయం ఆలోచించాడు ఆ పెద్దమనిషి. బాలిక త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండానే మొదట పనికి కుదిర్చిన చోట సరిగా లేదని కంప్లైంట్‌ సృష్టించి.. మరోచోట రూ.2 లక్షలకు బాలిక‌ను పనికి కుదిర్చాడు. ఇక్కడ అడ్వాన్సుగా ఇచ్చిన రూ.50 వేలను కూడా తన అప్పు కిందే జమ వేసుకున్నాడు. బాలిక ద‌వాఖాన‌లో చేరేదాక ఈ విషయాన్ని దాచే ఉంచ‌డం గ‌మానార్హం. అక్క‌డితో ఆగ‌కుండా అదంతా చిన్న ప్రమాద‌మ‌ని నమ్మబలికి తెలిసిన ఆసుపత్రిలో చేర్చి రహస్యంగా వైద్యం చేయించేందుకు య‌త్నించ‌గా అసలు విషయం వెలుగుచూసింది. అయితే తన బండారం బ‌య‌ట‌పెట్ట‌వ‌ద్ద‌ని, తన బాకీని మాఫీ చేస్తానని ఆ పెద్ద‌మ‌నిషి బేరాలు ఆడాడు. బిడ్డ కోలుకుంటుందేమోనన్న ఆశతో ఈ విషయంపై ఆ తల్లిదండ్రులు పెద్దగా దృష్టి సారించలేదు. బిడ్డ మృతి చెంద‌డంతో బాలిక తల్లిదండ్రులు పోలీసుల‌కు అస‌లు విష‌యం తెలియ‌జేశారు. దీంతో కేసు నమోదు చేసి బాలిక నిండు జీవితం బలికావడంలో పాత్ర పోషించిన పెద్ద‌మ‌నిషి పేరాల రాములును అదుపులోకి తీసుకున్న‌ట్లు ఖమ్మం రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అన్న అంశంపైనా దర్యాప్తు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఖ‌మ్మం అత్యాచార ఘ‌ట‌న‌లో కీల‌క ట్విస్టు.. అస‌లు సూత్ర‌ధారి వేరే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts