సీఎస్కే కెప్టెన్గా ధోనీ కొనసాగింపుపై గంభీర్ ఏమన్నాడో తెలుసా..?

October 30, 2020 at 6:09 pm

ఐపీఎల్ సీజన్ లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాలకు తగ్గట్లుగా ఆడకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పు జరుగుతుంది అన్న ప్రచారం కూడా జరిగింది. దీనిపై స్పందించిన జట్టు యాజమాన్యం ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించాడని… అంతకుమించి జట్టు కోసం ఎంతగానో శ్రమించడానికి ఒక సీజన్ పేలవ ప్రదర్శన చేసినంత మాత్రాన కెప్టెన్ మార్పు ఉంటుంది అనుకోవడం పొరపాటు అంటూ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్… వచ్చే సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకీ ధోనీ ని కెప్టెన్గా కొనసాగించాలి అని జట్టు యాజమాన్యం నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం ఎంతగానో శ్రమించాడని 3 ఐపీఎల్ టైటిల్స్ కూడా అందించాడని గుర్తుచేశాడు గౌతమ్ గంభీర్. కాగా ఎప్పుడూ ధోని గురించి నెగిటివ్ గా మాట్లాడే గౌతం గంభీర్ మొదటి సారి పాజిటివ్గా మాట్లాడడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సీఎస్కే కెప్టెన్గా ధోనీ కొనసాగింపుపై గంభీర్ ఏమన్నాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts