విద్యుత్ షాక్ తో రైతు దంపతుల మృతి..?

October 15, 2020 at 3:09 pm

పొలాన్ని జంతువుల బారి నుంచి రక్షించుకోవడానికి రైతు పెట్టిన రక్ష ఏకంగా రైతు ప్రాణం తీసింది. పొలంలో కట్టిన విద్యుత్ తీగ కారణంగా ఏకంగా రైతు సహా అతని భార్య మృత్యువాత పడిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. చేతికొచ్చిన పంట నాశనం అవుతుంది అని రక్ష ఏర్పాటు చేస్తే ఏకంగా ఆ రక్ష రైతు ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతానికి గురై రైతు సహా అతని భార్య కూడా మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలం పోదరుబండలో చెరుకుతోటలో జడలు వేయడానికి వెళ్లారు రైతు దంపతులు ఆనందరావు పార్వతులు. కూలీలు వచ్చేలోపు కొంత పని పూర్తి చేయాలని అనుకున్నారు కానీ అంతలో ఊహించని ఘటన జరిగింది. పొలానికి కంచె గా వేసిన విద్యుత్ వైర్లు తొలగించక పోవడంతో ఆ విద్యుత్ వైర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి చేరుకున్న అధికారులు మృతదేహాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

విద్యుత్ షాక్ తో రైతు దంపతుల మృతి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts