దారుణం : 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నోట్లో పురుగుల మందు పోసి మరి..?

October 24, 2020 at 4:53 pm

రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగిన దాఖలాలు కనిపించడంలేదు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో విదంగా కామందుల బారిన పడి చివరికి జీవితం బలవుతూనే ఉంది . ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కఠిన శిక్షల విధించిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. రోజురోజుకు మహిళా ప్రశ్నార్ధక జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటీవలి కర్నూలు జిల్లాలో మరో దారుణం ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా సదరు బాలికను చంపేందుకు నోట్లో పురుగుల మందు కూడా పోసారు కామందులు. ఇక అప్పటికే బాలిక కోసం వెతకడం ప్రారంబించిన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో బాలికను గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

దారుణం : 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నోట్లో పురుగుల మందు పోసి మరి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts