దారుణం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి..?

October 13, 2020 at 4:59 pm

ఇటీవలే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ ఘటన గురించి మరువక ముందే రాష్ట్రంలో ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దళిత యువకులపై జరుగుతున్న దాడులు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. దళిత యువకులపై అత్యాచారాలకు పాల్పడడం.. దాడులు చేయడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుబయట నిద్రిస్తున్న ముగ్గురు అక్కచెల్లెల్ల పై కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడడం కలకలం సృష్టించింది.

యాసిడ్ దాడిలో ముగ్గురు అక్క చెల్లెలు తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు అక్కచెల్లెల్ల పై యాసిడ్ దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురు అక్కచెల్లెళ్ళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts