దారుణం : పెళ్లి చేసుకున్నందుకు ప్రాణం తీసేసారు..?

October 30, 2020 at 6:40 pm

ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది శాపంగా మారిపోతుంది. ప్రేమిస్తే ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఒక ఘటన గురించి మరవకముందే మరో ఘటన తెర మీదికి వచ్చి అందరిని ఉలికిపాటుకు గురిచేసింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కూతురిని తమకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు అనే కారణంతో యువకుడిని దారుణంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.

ఈ దారుణ ఘటన తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే బోయిన్ పల్లి మండలం స్తంభం పల్లి కి చెందిన గౌతమి మహేష్ అనే యువతి యువకులు ప్రేమించుకున్నారు. ఇటీవలే ఇంట్లో తమ ప్రేమ విషయం చెబితే పెళ్ళికి ఒప్పుకోరు అని భయంతో దసరా పండుగ రోజున ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన యువతి తన కుటుంబ సభ్యులు యువకుని కుటుంబంపై దాడి చేయగా తీవ్రగాయాల పాలైన యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు.

దారుణం : పెళ్లి చేసుకున్నందుకు ప్రాణం తీసేసారు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts