దీపికా పదుకొనే ఫోటోని అధికారులు బాగా వాడేశారుగా..?

October 16, 2020 at 3:28 pm

ఎప్పుడు నిజ జీవితం లో కనీ వినీ ఎరుగని రీతిలో దృశ్యాలు మొత్తం కేవలం ప్రభుత్వ అధికారుల చేతివాటం తో కనిపిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వం పేద ప్రజల కోసం అందించే ఫలాలను అక్రమంగా దోచుకునేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే లేని వారి పేర్లను సృష్టించి వాటిని లబ్ధిదారుల ఖాతాలో చేర్చి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏకంగా అధికారులు ఇలా అక్రమాలకు పాల్పడేందుకు ఏకంగా సెలబ్రిటీల పేరును వాడుకోవడం సంచలన గా మారిపోయింది.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఫోటోతో ఒక జాబ్ కార్డు తయారు చేశారు అధికారులు. జాబ్ కార్డు ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. చివరికి కొంతమంది తమకు ఉపాధి దొరకడం లేదు అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. కేవలం దీపికా పదుకొనే మాత్రమే కాదు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లాంటి మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ ఫోటోలు కూడా జాబ్ కార్డులపై ఉండటం గమనార్హం.

దీపికా పదుకొనే ఫోటోని అధికారులు బాగా వాడేశారుగా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts