ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపు.. చెన్నై ఖేల్‌ఖతం?

October 18, 2020 at 7:39 am

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదిక‌గా గ‌త రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎంతో ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ ఘ‌న విజ‌యం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తొలుత తడబడినట్టు కనిపించింది.

ఓపెనర్ పృథ్వీషా తొలి ఓవర్ రెండో బంతికి డకౌట్ కాగా, 26 పరుగుల వద్ద రహానే (8) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అయితే, క్రీజులో కుదురుకున్న శిఖర్ ధవన్ జట్టును విజయం దిశగా నడిపించాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. ఇక ధావన్‌తో పాటు ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ బ్యాట్ ఝళిపించడంతో లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఢిల్లీ ఛేదించింది.

కాగా, సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో శిఖర్ ధావన్‌కి ఇదే తొలి శతకంకాగా.. సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో మళ్లీ నెం.1 స్థానానికి దూసుకెళ్లింది. ఆరో పరాజయంతో చెన్నై ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపు.. చెన్నై ఖేల్‌ఖతం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts