
రోజులు గడుస్తున్నాయి కానీ అమరావతిలో జరుగుతున్న నిరసనలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిలో ఎంతో ముందే తగిన జాగ్రత్తలు పాటిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఇటీవలే అమరావతి లొల్లి ఢిల్లీ వరకు వెళ్ళింది.. మూడు రాజధానులు కు సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు… ఢిల్లీ చేరుకుని అక్కడ నిరసనలు మొదలుపెట్టారు.
రాజ్ ఘాట్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు… ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సర్కార్ మూడు రాజధానులు కు సంబంధించిన నిర్ణయాన్ని విరమించుకోవాలని అంటూ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని.. అప్పటి వరకు తమ పోరాటం ఆగదు అంటూ స్పష్టం చేసారు జేఏసీ నేతలు. శాంతియుతంగా నిరసన తెలిపి కేంద్రం దృష్టికి అమరావతి వ్యవహారం తీసుకెళ్తాము అంటూ స్పష్టం చేశారు.