దేశంలో వ్యాక్సిన్ మొదట వాళ్లకే ఇస్తారట..?

October 17, 2020 at 7:13 pm

దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆరోగ్య కార్యకర్తలు పారిశుధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఏ చిన్న పొరపాటు జరిగిన ప్రాణం పోతుంది అని తెలిసినప్పటికీ విధినిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలిదశ వ్యాక్సిన్ పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము అంటూ కేంద్రం స్పష్టం చేసింది.

ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది అన్న విషయాన్ని ఇటీవల స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలి దశలో దేశ జనాభాలో 23 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది అంటూ తెలిపింది కేంద్రం. అంతేకాకుండా ఆరోగ్యం ఎక్కువగా అస్వస్థతకు గురైన వారికి కూడా తొలిదశలో కరోనా వ్యాక్సిన్ అందిస్తాము అంటూ స్పష్టం చేస్తోంది.

దేశంలో వ్యాక్సిన్ మొదట వాళ్లకే ఇస్తారట..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts