40రోజుల్లోనే మెగా హీరో సినిమాను పూర్తి చేస్తున్న‌ క్రిష్‌!

October 24, 2020 at 1:56 pm

మెగా హీరో, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్మ‌డు వైష్ణ‌వ్ తేజ్ మొద‌టి చిత్రం `ఉప్పెన` విడుద‌ల కాకుండానే.. రెండో సినిమాను ద‌ర్శ‌కుడు క్రిష్‌తో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో క్రిష్, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

News18 Telugu - పవన్ కళ్యాణ్‌ను పక్కనబెట్టి క్రిష్ మరో కొత్త సినిమా.. |  Krish Jagarlamudi started new movie and what about Pawan Kalyan movie pk-  Telugu News, Today's Latest News in Telugu

అటవీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా భాగం వికారాబాద్ పారెస్ట్‌లోనే చిత్రీకరించారు. కరోనా, భారీ వర్షాలు వంటి వాటిని లెక్క చేయకుండా టాకీ భాగం మొత్తాన్ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారు క్రిష్‌. ఇంకో ఒక్క పాట మాత్రమే మిగిలి ఉన్న‌ట్టు స‌మాచారం.

Krish Launches His Film With Vaishnav Tej - ManaTeluguMovies.net

ఆ ఒక్క పాటను మరో ఐదు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 40 రోజుల్లోనే మెగా హీరో సినిమాను క్రిష్ పూర్తి చేయ‌బోతున్నారు. అయితే. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారా..? లేక థియేటర్ లో రిలీజ్ చేస్తారా..? అనేది క్లారిటీ లేదు.

 

40రోజుల్లోనే మెగా హీరో సినిమాను పూర్తి చేస్తున్న‌ క్రిష్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts