అక్కడ పిల్లలకి తరగతులు ఎలా జరుగుతున్నాయో తెలుసా..?!

October 22, 2020 at 5:26 pm

కరోనా వైరస్ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ దెబ్బతో అన్ని షాపులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ అన్ని మూతపడి పోయి దివాలా తీశాయి. అయితే కరోనా ప్రభావం పిల్లల పాఠశాలలు, కళాశాలల మీద కూడా పడింది. కరోనా వల్ల ఈ ఏడాది పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో పిల్లల చదువు అధోగతి అయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశల్లోనూ ఇదే పరిస్థితి. అయితే కొవిడ్‌ తీవ్రత తగ్గిన దేశాల్లో మాత్రం ఖచ్చిత నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా ఉదృతి అధికంగా ఉన్న దేశాలలో ఇటలీ కూడా ఒకటి. ఇప్పటికి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మరి ఇటలీలో పిల్లల విద్యాబ్యాసం ఎలా ఉందంటే..

దక్షిణ ఇటాలియన్‌ ప్రాంతమైన కాంపానియాలో ఉపాధ్యాయులు వీధుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్ధులు కూడా పాఠశాలలకు వెళ్లకుండా వీధుల్లో ఉండే మెట్లపై సామజిక దూరం పాటిస్తూ, దూరం దూరంగా కూర్చుంటూ క్లాసులు వింటున్నారు. టీచర్లు బాల్కనీల్లో ఉంటూ పాఠాలు చెబుతున్నారు. ఇలా భౌతికదూరం పాటించడంతో పాటు విద్యార్థులను ప్రతక్ష్యంగా చూస్తూ పాఠాలు బోధించినవాళ్ళము అవుతామని ఉపాధ్యాయులు అంటున్నారు.

అక్కడ పిల్లలకి తరగతులు ఎలా జరుగుతున్నాయో తెలుసా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts