నర్తనశాల కొత్త అప్డేట్ తెలుసా..!

October 21, 2020 at 6:31 pm

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ నర్తనశాల రీమేక్ వీడియోను అక్టోబర్ 24 తేదీ రోజు విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. నర్తనశాలలో నందమూరి బాలకృష్ణ అటు కీచకుడు,అర్జునుడిగా ఇరు పాత్రల్లో నటించగా,ద్రౌపది పాత్రలో సౌందర్య నటించింది. ఇప్పటికే బాలకృష్ణ పోషించిన పాత్ర సంబందించిన పోస్టర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది.

 

ఇప్పుడు తాజాగా నర్తనశాల నుంచి ద్రౌపది లుక్ విడుదలైంది.సౌందర్య ద్రౌపది పాత్రలో లీనమైపోయి నటించిందని ఫస్ట్ లుక్ చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతోంది. సుమారు 17 నిమిషాలు ఉన్న ఈ వీడియోను శ్రేయాస్ ఈటీ యాప్ లో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. నర్తనశాలలో బాలకృష్ణ, సౌందర్యతో పాటు నటులు శ్రీహరి, శరత్‌కుమార్‌, ఉదయ్ కిరణ్, ఆశిన్ కీలక పాత్రల్లో నటించారు. సౌందర్య అకాల మరణం చెందడంతో నర్తనశాల ప్రాజెక్టును ఆపేస్తున్నట్టు బాలకృష్ణ పేర్కొన్న సంగతి అందరికి తెలిసిందే.

నర్తనశాల కొత్త అప్డేట్ తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts