దుబ్బాకలో ఓడితే.. హరీష్ పదవి పోద్దీ : జగ్గారెడ్డి

October 19, 2020 at 6:52 pm

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూపు మొత్తం దుబ్బాక ఉప ఎన్నికల పై ఉన్న విషయం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఇక అటు అధికార ప్రతిపక్ష పార్టీలు దుబ్బాక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శరవేగంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీ నేతలందరూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . అదే సమయంలో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్రావు రంగంలోకి దుబ్బాక లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల దుబ్బాక లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హరీష్ రావు పై విమర్శలు గుప్పించారు. ఒకవేళ దుబ్బాక లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే హరీష్ రావ్ మంత్రి పదవి పోతుంది అంటూ జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెబుతారు అంటూ వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది అని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని తెలిపారు.

దుబ్బాకలో ఓడితే.. హరీష్ పదవి పోద్దీ : జగ్గారెడ్డి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts